Random Video

AP Grama Sachivalayam Appointment Letters Issued By AP CM Jagan || Oneindia Telugu

2019-09-30 192 Dailymotion

Handing over Appointment Letters to Village/Ward Secretariat Selected Candidates & Address by Honorable Chief Minister of Andhra Pradesh Shri Y. S. Jaganmohan Reddy at A Plus Convention Center, Vijayawada
#APGramaSachivalayam
#AppointmentLetters
#APCMJagan
#vijayawada
#kodalinani
#peddireddyramachandrareddy
#bothsasathyanarayana

అధికారం చెలాయించడం కోసం ఉద్యోగం చేయడం లేదు.. సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని విఙ్ఞప్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయన సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్‌ సహా మంత్రులు మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు.